»Deputy Cm Pawan Kalyan We Will Start From Pithapuram
Deputy CM Pawan Kalyan: పిఠాపురం నుంచే ప్రారంభిస్తాం
గత ప్రభుత్వం అంత వ్యర్థం చేసిందని, రాష్ట్రంలోని ఏ పంచాయతీలో కూడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామని పవన్ కల్యాణ్ తెలిపారు.
Deputy CM Pawan Kalyan: We will start from Pithapuram
Deputy CM Pawan Kalyan: గత ప్రభుత్వం అంత వ్యర్థం చేసిందని, రాష్ట్రంలోని ఏ పంచాయతీలో కూడా డబ్బులు లేవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. తాడేపల్లిలోని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కార్యాలయానికి మొదటిసారి వెళ్లారు. ఈ కార్యాలయంలో సాలిడ్ అండ్ లిక్విడ్ రీసోర్స్ మేనేజ్మెంట్పై ఫొటో ఎగ్జిబిషన్‌ను చూశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాలిడ్ అండ్ లిక్విడ్ రిసోర్స్ మేనేజ్మెంట్ను ముందుకు తీసుకెళ్లాలన్నారు. జలం చాలా ముఖ్యమైనది. అది కాలుష్యం కాకుండా కాపాడుకోవాలి. ప్రస్తుతం ప్లాస్టిక్ వ్యర్థాలతో ఇబ్బందులు చాలా వస్తున్నాయి.
ప్లాస్టిక్ కవర్లు తినడం వల్ల ఆవులు చనిపోవడం చాలా బాధాకరంగా ఉందన్నారు. చెత్తను రీసైక్లింగ్ చేసి పంచాయతీలు ఆదాయం పొందేలా చర్యలు చేపట్టాలన్నారు. ఎస్‌ఎల్‌ఆర్‌ఎంను మొదట పిఠాపురం నుంచే ప్రారంభిస్తామన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్, పరిశుభ్రతను ప్రజలు బాధ్యతగా తీసుకోవాలి. ఒక్కో పంచాయతీలో చెత్త సేకరించి సంపద సృష్టించే ప్రయత్నం చేస్తామని తెలిపారు. చెత్తతో ఏటా రూ. 2,643 కోట్ల ఆదాయం తీసుకురావచ్చని తెలిపారు. రాష్ట్రంలో 2.5 లక్షల మందికి ఉపాధి కల్పించేందుకు వీలవుతుందన్నారు. రాష్ట్రంలో పంచాయతీల్లో మార్పు తెచ్చేందుకు కొంత సమయం పడుతుందని పవన్ తెలిపారు.