టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కందుకూరులో బహిరంగ సభ నిర్వహించిన సమయంలో… అక్కడ తొక్కిసలాట జరిగి..8మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనపై జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్ హెచ్ ఆర్సీ) తాజాగా కేసు నమోదు చేసింది. బహిరంగ సభ నిర్వహించి అమాయకుల ప్రాణాలు తీశారని, సభ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలంటూ.. విజయవాడకు చెందిన డాక్టర్ అంబటి నాగ రాధ కృష్ణ యాదవ్.. గత నెల 29న ఎన్ హెచ్ ఆర్సీకి ఫిర్యాదు చేశారు. ఆయన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు.
కందుకూరు సభకు జనాలు ఎక్కువమంది వచ్చారని చూపించుకోవడం కోసం ఇరుకైన వీధుల్లో ఉద్దేశపూర్వకంగా రోడ్‌షో ఏర్పాటు చేసి తొక్కిసలాటకు కారణం అయ్యారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇరుకైన వీధుల్లో జనాలు పోగైతే డ్రోన్ షాట్స్ బాగా వస్తాయని.. వీటిని పార్టీ పబ్లిసిటీ కోసం వినియోగించుకోవచ్చని నిర్వాహకులు ఉద్దేశపూర్వకంగా రోడ్ షోకు ప్లాన్ చేశారని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు.