»Mlc Varudu Kalyani Doesnt Have The Courage To Take A Selfie Chandrababu
MLC Varudu Kalyani: చంద్రబాబుకు అంత ధైర్యం లేదు
ఏపీ టీడీపీ అధినేత చంద్రబాబు(chandrababu) సెల్ఫీ విత్ టిడ్కో ఇళ్ల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు(MLC Varudu Kalyani) కళ్యాణి కౌంటర్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు ధైర్యముంటే తాము నిర్మించిన 17 వేల కాలనీల వద్దకు రావాలని కోరారు. అక్కడకు వచ్చి లబ్దిదారులతో సెల్ఫీలు దిగాలని సవాల్ చేశారు. ఈ క్రమంలో టీడీపీ(TDP) హాయంలోనే టిడ్కో ఇళ్లలో భారీగా అవినీతి జరిగిందని ఆమె ఆరోపించారు.
ఏపీలో టిడ్కో ఇళ్ల(tidco houses)పై ప్రతిపక్ష నేత టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు(chandrababu naidu) చేసిన వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి(MLC Varudu Kalyani) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆమె టీడీపీ నేతపై విరుచుకుపడ్డారు. చంద్రబాబు సెల్ఫీతో సెల్ఫ్ గోల్ చేసుకున్నారని వ్యాఖ్యలు చేశారు. వంచనకు అలవాటు పడిన టీడీపీ నేతలు ఇప్పటికీ అదే పని కొనసాగిస్తున్నారని ఆమె ఆరోపించారు. ఇదే అబద్ధాన్ని పదిసార్లు పునరావృతం చేసినంత మాత్రాన ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు ఉన్నారని వరుదు కల్యాణి పేర్కొన్నారు.
అసలు టిడ్కో ఇళ్ల పేరుతో గత ప్రభుత్వమే భారీగా అవినీతికి పాల్పడిందని ఆమె ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్(AP) రాష్ట్రంలో 17 వేల కాలనీలు నిర్మిస్తున్నామని..అక్కడికి వెళ్లి చంద్రబాబు సెల్ఫీలు దిగాలని కోరారు. అంతేకాదు ఇప్పటికే 50 వేల టిడ్కో ఇళ్లు ఇచ్చామని.. రానున్న రెండు నెలల్లో మరో 40 వేల టిడ్కో ఇళ్లు ఇస్తామని ఆమె స్పష్టం చేశారు. సీఎం జగన్ మోహన్ రెడ్డి ఏపీలో ఉళ్లకు ఉళ్లే కట్టిస్తున్నట్లు గుర్తు చేశారు. ఇప్పటికే 30 లక్షల 50 వేల మందికి ఇళ్ల స్థలాలు ఇచ్చామని చెప్పారు. ఈ నేపథ్యంలో ధైర్యముంటే లబ్ది దారుల వద్దకు వెళ్లి చంద్రబాబు ఫొటోలు దిగాలని సూచించారు. అంతేకాదు 21 లక్షల ఇళ్లను ప్రభుత్వమే నేరుగా కట్టిస్తున్నట్లు చెప్పారు.
ఈ నేపథ్యంలో గత ప్రభుత్వంలో మీరు ఏం చేశారో ఎందుకు చెప్పుకోలేక పోతున్నారని వరుదు కళ్యాణి విమర్శించారు. ఎన్నికలు అయిన తర్వాత మీ మ్యానిఫెస్టును ఎందుకు టీడీపీ(TDP) వెబ్ సైట్ నుంచి తొలగించారని ప్రశ్నించారు. ప్రత్యేక హోదా అంశాన్ని తుంగలో తొక్కిన టీడీపీ కేన్సర్ కణితి లాంటిదని వ్యాఖ్యనించారు. కక్కుర్తి కోసం పోలవరం ప్రాజెక్టును నిర్లక్ష్యం చేసి వదిలేశారని ఆమె ఆరోపించారు. అంతేకాదు టీడీపీ మేనిఫెస్టోను చెత్తబుట్టలో పడేసిన ఘనత చంద్రబాబుకే దక్కుతుందని, మొత్తం 175 స్థానాల్లో పోటీ చేసే దమ్ము టీడీపీకి ఉందా అంటూ ఆమె సవాల్ విసిరారు.