»Minister Roja Filed A Defamation Suit Against Tdp Leaders
Minister Roja: టీడీపీ నేతలకు షాక్..వారిపై పరువు నష్టం దావా వేసిన మంత్రి రోజా
వైసీపీ మంత్రి రోజా టీడీపీ నేత బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేసింది. అలాగే నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ పేరును కూడా పరువు నష్టం దావా పిటిషన్లో నమోదు చేసింది.
ఆంధ్రప్రదేశ్ (Andhrapradesh)లో పొలిటికల్ హీట్ పెరిగింది. ఎన్నికల రానున్న తరుణంలో వైసీపీ (YCP)కి పోటీగా టీడీపీ (TDP), జనసేన పార్టీలు (Janasena Party) తమ బలాన్ని పుంజుకుంటున్నాయి. నేతల మధ్య మాటల అస్త్రాలు, విమర్శలు జోరందుకున్నాయి. తాజాగా వైసీపీ మంత్రి రోజా తన ప్రత్యర్థి పార్టీ నేతలపై విరుచుకుపడింది. ఏపీలో పొలిటికల్ ఫైర్ బ్రాండ్‌గా పేరు తెచ్చుకున్న రోజా చంద్రబాబు అరెస్ట్ (Chandrababu Arrest) తర్వాత పలు వ్యాఖ్యలు చేసి వార్తల్లో నిలిచింది. ఈ క్రమంలో టీడీపీ నేతలకు, రోజాకు మధ్య మాటల యుద్ధం సాగింది.
మంత్రి రోజా (Minister Roja)ను టీడీపీ నేత బండారు సత్యనారాయణ (Bandaru Satyanarayana) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. రోజాపై ఆయన అనుచిత వ్యాఖ్యలు చేయగా రోజాకు మద్ధతుగా సినీ సెలబ్రిటీలు సైతం నిలిచారు. రోజా బతుకేంటో తనకు తెలుసని అంటూనే ఆమెపై ఇష్టానురీతిలో బండారు సత్యనారాయణ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ సందర్భంగా మంత్రి రోజా మీడియా ముఖంగా కన్నీటిపర్యంతమైంది. ఆ ఘటన ఏపీలో తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే.
తాజాగా ఆమె ఈ విషయంలో పరువు నష్టం దావా వేసింది. తనను కించపరిచిన వారి వీడియోలను మేజిస్ట్రేట్ ముందు చూపించి మాజీ మంత్రి బండారు సత్యనారాయణపై పరువు నష్టం దావా వేసింది. ఆయనతో పాటుగా నగరి టీడీపీ ఇన్ఛార్జ్ గాలి భానుప్రకాష్ (Gali Bhanuprakash), టీవీ5 ఇన్ఛార్జ్ రాజేంద్ర ప్రసాద్ పేర్లను పిటిషన్లో నమోదు చేసింది. తన గౌరవానికి భంగం కలిగించేలా మాట్లాడారని రోజా తన పిటిషన్లో పేర్కొంది. అసభ్య పదజాలంతో బండారు సత్యనారాయణ చేసన వ్యాఖ్యలపై గతంలో గుంటూరు జిల్లా నగరం పాలెం పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తాజాగా ఆమె వారిపై పరువు నష్టం దావా వెయ్యడంతో ఏపీ రాజకీయాలు చర్చనీయాంశమయ్యాయి.