తిరుమల(Tirumala) శ్రీవారిని దర్శించుకునేందుకు ప్రపంచ నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు తరలివస్తుంటారు. తాజాగా తిరుమలలో శ్రీవారి లడ్డూ(Srivari laddu)లను పక్కదోవ పట్టిస్తున్న ఐదుగురిని విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. 17 లడ్డూ ట్రేలకు సంబంధించిన లడ్డూల విక్రయాల లెక్కలు తేలకపోవడంతో అధికారులకు అనుమానం వచ్చింది. దీంతో ఆ ఉద్యోగులపై అధికారులు నిఘా ఉంచారు.
ఐదుగురిని విచారించిన తర్వాత వారి వద్దే తప్పు జరిగినట్లుగా టీటీడీ(TTD) గుర్తించింది. అక్రమ మార్గంలో లడ్డూలను విక్రయిస్తున్న ఆ ఐదుగురిని టీటీడీ(TTD) విజిలెన్స్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా వారిని ప్రశ్నిస్తున్నట్లు తెలిపారు. తిరుమల(Tirumala)కు నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. శ్రీవారి దర్శనం తర్వాత భక్తులు ఎంతగానో ప్రాధాన్యత ఇచ్చేది లడ్డూ ప్రసాదానికే.
ప్రపంచ వ్యాప్తంగా కూడా టీటీడీ(TTD) శ్రీవారి లడ్డూకు ఎంతో డిమాండ్ ఉంది. తిరుమల(Tirumala) లడ్డూ ప్రసాదాన్ని బంధువులకు, మిత్రులకు పంచేందుకు భక్తులు తీసుకెళ్తుంటారు. భక్తులకు లడ్డూలు ఇచ్చేందుకు టీటీడీ కూడా ప్రత్యేకంగా చర్యలు తీసుకుంది. అయితే బూందీ పోటులో లడ్డూ(Laddus)లను తయారు చేసిన తర్వాత ట్రేల ద్వారా లడ్డూలను విక్రయశాలకు తీసుకెళ్తారు. ఆ తర్వాత విక్రయశాలలో లడ్డూలను ఉంచి భక్తులకు అమ్ముతుంటారు. అక్కడే తేడా రావడంతో విజిలెన్స్ అధికారులు ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు.