»Attack Of Avinash Reddys Followers On Media Governor Tamilisai Condemned
Avinash Reddy : మీడియాపై అవినాశ్ రెడ్డి అనుచరుల దాడి..ఖండించిన గవర్నర్ తమిళిసై
కవరేజ్‌కు వెళ్లిన మీడియా ప్రతినిధులపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడం పాశవిక చర్యగా భావిస్తున్నామని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షులు రవితేజ, ఉఫాధ్యక్షులు ఆర్వి సూర్యనారాయణరెడ్డి, ప్రెస్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మాజీ సభ్యుడు ఉప్పల లక్ష్మణ్ తెలిపారు
కడప ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) అనుచరులు వీరంగం సృష్టించారు. న్యూస్ కవరేజ్ చేస్తున్న మీడియాపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడి చేశారు. కెమెరా లాక్కొని వాహనాలు ధ్వంసం చేశారు. అవినాష్ వాహనాన్ని అనుసరిస్తుండగా జర్నలిస్టుల (Journalists) దాడికి పాల్పడ్డారు. ప్రముఖ మీడియా సిబ్బందిపై అవినాష్ రెడ్డి అనుచరులు దాడికి దిగారు. రిపోర్టర్, కెమెరామెన్ పై అవినాష్ అనుచరులు పిడిగుద్దులు కురిపించారు. తీంతో రిపోర్టర్(Reporter), కెమెరామెన్ తీవ్రంగా గాయపడ్డారు. అంతటితో ఆగకుండా కెమెరా లాక్కుని పగులగొట్టారు.ఈ వ్యవహారాన్ని మీడియా(Media) ప్రతినిధులు.. తెలంగాణ గవర్నర్ తమిళిసై (Governor Tamilisai) దృష్టికి తీసుకెళ్లారు.
దీంతో స్పందించిన ఆమె.. మీడియా సిబ్బందిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. మీడియా మీద దాడి.. ప్రజాస్వామ్యంపై దాడేనన్నారు. ఇందుకు బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె తెలిపారు.మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి (Vivekananda Reddy)హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డి ఈ రోజు సీబీఐ (CBI) విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి ఆరోగ్యం బాగా లేదని చెప్పి పులివెందులకు ఆయన బయలుదేరారు. అయితే అవినాశ్ కాన్వాయ్ ని అనుసరిస్తున్న రెండు మీడియా చానళ్ల కార్లపై అవినాశ్ అనుచరులు దాడి చేశారు. ఓ చానల్ రిపోర్టర్ పై దాడి చేసి కెమెరా లాక్కెళ్లారు. ఓ కారు అద్దాలు ధ్వంసం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు బయటికొచ్చాయి.