Kommareddy Pattabhiram: వైఎస్ జగన్ లక్షల కోట్ల అవినీతి చేశారని టీడీపీ నేత కొమ్మారెడ్డి పట్టాభిరామ్ ఆరోపించారు. ఐదేళ్లలో జగన్ రూ.8 లక్షల కోట్ల అవినీతి చేశారని ఆయన అన్నారు. అవినీతికి అడ్డుకట్ట వేస్తే సంక్షేమ కార్యక్రమాలన్నీ అమలు చేయవచ్చు అన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అవినీతిని అరికట్టి.. రాష్ట్ర ఆదాయాన్ని పెంచుతామని తెలిపారు. కూటమి మేనిఫెస్టో విడుదల చేసిన పథకాలను అమలు చేస్తామని తెలిపారు.
జాతీయ ఆకాంక్షలను బీజేపీ మేనిఫెస్టో.. ప్రాంతీయ ఆకాంక్షలను టీడీపీ, జనసేన ఉమ్మడి మేనిఫెస్టో నెరవేరుస్తాయని బీజేపీ నేత లంకా దినకర్ అన్నారు. బీజేపీ జాతీయ శక్తి.. టీడీపీ, జనసేన ప్రాంతీయ శక్తి. ఈ రెండు శక్తులు కలిస్తే దేశ, రాష్ట్ర అభివృద్ధికి మహాశక్తి. మోదీ గ్యారంటీ.. బాబు ష్యూరిటీ.. పవన్ పాపులారిటీ.. ఎన్డీయే విక్టరీ అని అన్నారు. వికసిత్ భారత్.. వికసిత్ ఆంధ్రా మా స్ఫూర్తి అన్నారు. దేశం, రాష్ట్రం రెండు కూడా సర్వతోముఖాభివృద్ధి సాధించాలన్నారు. చిల్లర రాజకీయాలు చేయడంలో జగన్ ముందుంటారు. ఇకనైన అవి మానుకోవాలన్నారు.