Kodali Nani : కులాల పేరుతో గొడవలు పెడుతున్నారు… కొడాలి నాని
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై మాజీ మంత్రి కొడాలి నాని విమర్శల వర్షం కురిపించారు. మంగళవారం మచిలీపట్నం వేదికగా.. పవన్ కళ్యాణ్ నిర్వహించిన జనసేన ఆవివార్భావ వేదికను ఉద్దేశించిన కొడాలి నాని సంచలన ట్వీట్ చేశారు. ఆ సభలో పవన్ చేసిన వ్యాఖ్యలపై మండిపడ్డారు.

“మా నాన్న హారతి పళ్ళెంలో కర్పూరంతో సిగరెట్ వెలిగించుకునే వారు” అని కన్న తండ్రి గురించే తప్పుగా మాట్లాడిన వ్యక్తి ఈ పవన్ కళ్యాణ్. ఈరోజు కులాల పేరుతో ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో గొడవలు పెట్టాలని చూస్తున్నాడు. ఈయనకి ఎమ్మెల్యే అయ్యే అర్హత కూడా లేదు’’ అంటూ ఆయన ట్విట్టర్లో విమర్శించారు. మరి ఈ విషయంలో పవన్ ఎలా స్పందిస్తారు అనేది తెలియాల్సి ఉంది.