Kanna Lakshmi Narayana : ‘కుర్చీ నుంచి దిగిపో.. రైతులను మేం ఆదుకుంటాం’
అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు.
Kanna Lakshmi Narayana : అకాల వర్షం కారణంగా రైతులు నానావస్థలు పడుతుంటే సీఎం తాడేపల్లి పాలెస్(Tadepalli Palace)లో కూర్చుని చోద్యం చూస్తున్నారని టీడీపీ నేత కన్నా లక్ష్మీ నారాయణ(Kanna Lakshmi Narayana) ఆరోపించారు. రైతులు(Farmers), రాష్ట్రం(State) ఏమైపోయినా పర్లేదు, సీఎం కుర్చీ ఉంటే చాలు… తనకు రావాల్సిన ఆదాయం వస్తుందన్న ధీమాలో జగన్(Jagan) ఉన్నారని మండిపడ్డారు. వర్షాల కారణంగా నష్ట పోయిన రైతులకు ధైర్యం చెప్పాల్సిన ప్రభుత్వం ప్రతిపక్షం(opposition)పై విమర్శలు చేస్తోందన్నారు. జగన్ తన పదవి నుంచి తప్పుకుంటే, రైతన్నలకు టీడీపీ(TDP) న్యాయం చేసి చూపిస్తుందన్నారు. అకాల వర్షా(Untimely rain)లకు సర్వం కోల్పోయి రైతులు విలపిస్తుంటే, ముఖ్యమంత్రి నీరో చక్రవర్తి(Emperor Nero)లా తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ధాన్యం మొలకెత్తి, మిర్చి నీళ్ల పాలై, ఇతర పంటలు పొలాల్లో కుళ్లిపోతుంటే, మంత్రులు ప్రతిపక్ష నేతలను తిడుతూ కాలక్షేపం చేస్తున్నారన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) గోదావరి జిల్లా(Godavari Dist)ల్లో పర్యటిస్తే అనేక విషయాలు వెలుగు చూశాయన్నారు. రైతును భక్షించే కేంద్రాలుగా ఆర్బీకే(BRK)లు ఉన్నాయన్నారు. తడిసిన ధాన్యాన్ని తీసుకెళ్తే లారికి 10 వేలు అదనంగా వసూలు చేస్తున్నారన్నారంటూ మండి పడ్డారు. 75 కిలోల ధాన్యం బస్తాకు ఒకచోట 5 కేజీలు, మరోచోట 12 కేజీలు అదనంగా ధాన్యం ఇవ్వాలని మిల్లర్లు డిమాండ్ చేస్తున్నారు. కొన్నిచోట్ల మిల్లర్ల(Millers)ను అడ్డంపెట్టుకొని ప్రభుత్వమే బస్తాకు రూ.100 నుంచి రూ.200 లు అనధికారికంగా వసూలుచేస్తోంది. మామిడి(Mango), మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లిందన్నారు. నాలుగేళ్లలో పంట కాపాడుకునేందుకు ఒక పరదా పట్టా అయినా ఇప్పించారా? అని కన్నా లక్ష్మీనారాయణ ప్రశ్నించారు.
ఎన్నికల సమయంలో జగన్ ప్రకటించిన రూ.3 వేలకోట్ల ధరల స్థిరీకరణ నిధి(Price Stabilization Fund), రూ.2 వేల కోట్ల ప్రకృతి విపత్తుల సహాయ నిధి ఏమైందో సీఎం రైతులకు చెప్పాలని డిమాండ్ చేశారు. రైతుల పక్షాన సీఎం జగన్(CM Jagan) ముందు కొన్ని డిమాండ్లు ఉంచారు. రాష్ట్రంలోని ప్రతి ధాన్యం గింజను ప్రభుత్వమే రైతులనుంచి గిట్టుబాటు ధరకు కొనాలి. పంటల్ని కాపాడుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయిన రైతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. ధాన్యం కొనుగోళ్లలో తేమ పేరుతో 75 కిలోల ధాన్యం బస్తాకు 5 నుంచి 12 కిలోల ధాన్యాన్ని అదనంగా సేకరిస్తున్నారు. ఆ విధంగా సేకరిస్తున్న ధాన్యాన్ని ప్రభుత్వమే తిరిగి రైతుకు ఇప్పించాలి. అపరాల పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ.25 వేలు, వాణిజ్య పంటల రైతులకు ఎకరాకు రూ.50 వేల పరిహారం ఇవ్వాలి. తమ కష్టం చెప్పుకోవడానికి వెళ్లిన రైతుల్ని ఎర్రి పప్ప అన్న మంత్రిపై చర్యలు తీసుకోవాలి.