టీడీపీ అధినేత చంద్రబాబు పై ప్రజాశాంతి పార్టీ అధినేత కేఏ పాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కందుకూరు లో చంద్రబాబు నిర్వహించిన సభలో తొక్కిసలాట జరిగి దాదాపు ఎనిమిది మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. కాగా… ఈ విషయంపై కేఏ పాల్ స్పందించారు. ఈ దుర్ఘటన పై కేఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
గ్రౌండ్ లో పెట్టుకోవాల్సిన సభ రోడ్డు మీదకు రావడం వల్లే ఈ దుర్ఘటన జరిగిందని అన్నారు. అంతేకాదు, చంద్రబాబుపై కందుకూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరుకు రోడ్డులో సభ పెట్టారని ఆరోపించారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని కేఏ పాల్ చెప్పారు. మృతుల పిల్లలకు తమ ఛారిటీ ద్వారా విద్యను అందిస్తామని హామీ ఇచ్చారు.