JC Prabhakar Reddy:జేసీ ప్రభాకర్ రెడ్డి (JC Prabhakar Reddy).. తాడిపత్రి మున్సిపల్ చైర్మన్.. అయినప్పటికీ విలక్షణ రాజకీయ నేత. అవును కట్టు, బొట్టు, యాస అంత వేరే లెవల్. తాజాగా ఆయన ఓ ఫోటో పోస్ట్ చేశారు. బుల్లెట్ బండి (Bullet bike) పక్కన ఉండి ఫోజులు ఇచ్చారు. వాటిని ట్వీట్ చేసి.. తన పాత రోజులను గుర్తుకు చేసుకున్నారు.
రాయల్ ఎన్ ఫీల్డ్ (Royal Enfield) షోరూంలో ప్రభాకర్ రెడ్డి (prabhakar reddy) ఉన్నారు. క్లాసిక్ బండి పక్కన నిల్చొని ఫోటోలకు చక్కగా ఫోజులు ఇచ్చారు. గడ్డం పెంచి.. తెల్లని వస్త్రాలు ధరించి.. ఓ బాబా మాదిరిగా కనిపించారు. ఆ ఫోటోలు చూస్తే.. ప్రభాకర్ రెడ్డేనా ఇతను అనుకునేలా ఉన్నాయి.
టీనేజీలో ఉన్నప్పుడు తాను జావా (java) మోటార్ సైకిల్ నడిపేవాడినని రాసుకొచ్చారు. ఇప్పుడు బుల్లెట్ బండి (Bullet bike) పక్కన ఉంటే ఆ నాటి జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయని తెలిపారు. ఇటీవల నారా లోకేశ్ యువగళం పాదయాత్ర అనంతపురం జిల్లాలోకి రాగా.. గ్రాండ్ వెల్ కం చెప్పారు ప్రభాకర్ రెడ్డి. కార్యకర్తలతో జోష్గా డ్యాన్స్ (dance) వేశారు. లోకేశ్ గురించి కొనియాడారు.