»Janasenani In Chanchal Guda Womens Jail Pawans Old Photo Goes Viralpawan Kalyan %e0%b0%9a%e0%b0%82%e0%b0%9a%e0%b0%b2%e0%b1%8d %e0%b0%97%e0%b1%82%e0%b0%a1 %e0%b0%ae%e0%b0%b9%e0%b0%bf%e0%b0%b3
Pawan Kalyan: చంచల్ గూడ మహిళా జైల్లో జనసేనాని.. పవన్ ఓల్డ్ ఫోటో వైరల్
జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ ముందు నుంచే సామాజిక సేవాలో యాక్టీవ్‌గా ఉండేవాడు. సాక్ష్యంగా జనసేన అధికారిక పార్టీ ఎక్స్ గ్రూప్‌లో ఓ ఫోటోను షేర్ చేసింది. ఈ ఫోటోలో చంచల్ గూడ జైల్లో పవన్ కూర్చొని ఉన్నాడు.
Janasenani in Chanchal Guda Women's Jail.. Pawan's old photo goes viral
Pawan Kalyan: జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్(Pawan Kalyan ) సామాజిక స్పృహ ఉన్న వ్యక్తి అని అందరికీ తెలిసిందే. అందుకే సంవత్సరానికి రెండు సినిమాలు చేసుకుంటూ కోట్లల్లో డబ్బులు తీసుకోవాల్సిన ఆయన ప్రజల మధ్య పాట్లు పడుతున్నాడు. ప్రజా సమస్యకోసం, సామాజిక బాధ్యతగా జనసేన పార్టీని స్థాపించారు. గతంలో ఆయన చంచల్ గూడ జైల్లో ఓ సమావేశంలో ఉన్న ఫోటోను జనసేన పార్టీ సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.
1999లో పవన్ కల్యాణ్ చంచల్ గూడలోని మహిళా జైలును సందర్శించారు. ఆ సమయంలో ఐపీఎస్ అధికారి ఎంవీ కృష్ణారావు జైళ్ల శాఖ డీజీగా ఉన్నారు. జైల్లోని మహిళా ఖైదీల స్థితిగతులను పవన్ కల్యాణ్ స్వయంగా
అడిగి తెలుసుకున్నారు. ఈ ఫొటోలో పవన్‌తో పాటు అప్పటి డీఐజీ నరసింహారెడ్డి, మహిళా జైలు సూపరింటిండెంట్ లక్ష్మి ఉన్నారు. అప్పటినుంచే పవన్ కల్యాణ్‌కు సమాజిక సృహ ఎలాంటిదో ఉదహరించడానకి అంటూ జనసేన పార్టీ ట్వీట్ చేసింది.