Golden Doors in Garbh Griha : అయోధ్య గర్భాలయంలో బంగారు తలుపులు
అయోధ్యలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం సందడిగా మారింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అధికారులు క్షణ తీరిక లేకుండా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయం మొత్తం అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తాజాగా గర్భ గృహంలో తలుపులు అమర్చే కార్యక్రమం కూడా పూర్తయింది.
అయోధ్యలో ప్రస్తుతం ఎటువంటి వాతావరణం సందడిగా మారింది. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం జరగడానికి కేవలం 5 రోజులు మాత్రమే మిగిలి ఉండడంతో శరవేగంగా పనులు జరుగుతున్నాయి. అధికారులు క్షణ తీరిక లేకుండా పనులను పర్యవేక్షిస్తున్నారు. ఆలయం మొత్తం అత్యంత సుందరంగా తీర్చిదిద్దే పనిలో పూర్తిగా నిమగ్నమై ఉన్నారు. తాజాగా గర్భ గృహంలో తలుపులు అమర్చే కార్యక్రమం కూడా పూర్తయింది.
అయోధ్యలో బాల రాముడి ప్రాణ ప్రతిష్ట కార్యక్రమానికి సర్వం సిద్ధమౌతోంది. ఈ నెల 22 న ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ కార్యక్రమానికి ముందు అనేక పనులు చకచకా జరుగుతున్నాయి. గర్భ గృహంలో బంగారు తలుపులను అమర్చే పని దిగ్విజయంగా పూర్తయింది. 12 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు కలిగిన ఈ తలుపులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. రామమందిరపు గ్రౌండ్ ఫ్లోర్లో ద్వారానికి ఈ తలుపులు అమర్చారు. రామాలయం మొత్తం 46 డోర్లు అమర్చనున్నారు. వీటిలో 42 డోర్లు వంది కిలోల బంగారంతో పూత పూయబడి ఉండడం విశేషం. ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం ఈ నెల 22వ తేదీన జరగనుండగా..వైదిక కార్యక్రమాలు జనవరి 16 నుంచి ప్రారంభం కానున్నాయి.
శ్రీరామ మందిరం ప్రాణ ప్రతిష్ట కార్యక్రమం కోసం భద్రతా ఏర్పాట్లకు సంబంధించిన బ్లూప్రింట్ కూడా సిద్ధమైంది. సెంట్రల్ రిజర్వ్ ఫోర్స్‌తో పాటు రాష్ట్ర పోలీసు బలగాలను ప్రతి వీధిలో మోహరిస్తారు. భద్రతా ఏర్పాట్లకు సరిపడా పోలీసులు ఉన్నారు. వీటిలో సీఆర్పీఎఫ్, యూపీఎస్ఎస్ఎఫ్, పీఎస్సీ, పౌర పోలీసు బలగాలు ఉన్నాయి. రామ మందిర భద్రత కోసం కొత్త భద్రతా ఏర్పాట్లు అమలు చేయనున్నారు. దీనిప్రకారం సరైన అనుమతి లేకుండా, ఎవరూ ఆలయం దగ్గరకు వెళ్లలేరు.
భక్తుల రద్దీ దృష్ట్యా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. వివిధ చోట్ల చెకింగ్ పాయింట్లు ఏర్పాటు చేశారు. సీసీ కెమెరాల ద్వారా కూడా పర్యవేక్షణ చేయనున్నారు. డ్రోన్లు ఎగరాలంటే అనుమతి తప్పనిసరి చేశారు. రానున్న రోజుల్లో నది ఒడ్డున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తామన్నారు. నది భద్రత పటిష్టం. శ్రీరామ ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమంలో భాగంగా 37 ప్రభుత్వ, ప్రభుత్వేతర భూముల్లో పార్కింగ్ ఏర్పాట్లు ఉంటాయి. పార్కింగ్ ప్రదేశాల్లో కూడా కెమెరాలు అమర్చే కార్యక్రమం శర వేగంగా జరుగుతోంది.
జనవరి 22, 23 తేదీల్లో నగరంలో భారీ వాహనాల ప్రవేశం లేకుండా పోలీసులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. చిన్న వాహనాలు సులువుగా గమ్యస్థానానికి చేరుకునేలా ఏర్పాట్లు చేయనున్నారు. ఆహ్వానితులకు మెరుగైన ఏర్పాట్లు ఉంటాయి. దారి మళ్లింపు గురించి సమాచారం వివిధ మాధ్యమాల ద్వారా ఇవ్వబడుతుంది. దీక్షా కార్యక్రమంలో ఇంటెలిజెన్స్ వింగ్ చురుకుగా ఉంటుంది. భద్రత విషయంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయం కూడా తీసుకోనున్నారు. తద్వారా ఎక్కడైనా ఇబ్బందులు తలెత్తితే వెంటనే సమాచారం తెలుసుకుని వారిపై నిఘా ఉంచేలా చూస్తున్నారు.
#WATCH | Installation of golden doors in ‘Garbh Griha’ of #Ayodhya’s Ram Temple stands complete
– The Golden Doors in the ‘Garbha Griha’ of Ram Mandir is about 12 feet high and 8 feet wide. These doors have been installed on the ground floor of the sanctum sanctorum of… pic.twitter.com/E1mDJrIbgh