»Ayodhya Ram Temple Releases Aarti Darshan Timings In View Of Huge Rush
Ayodhya : అయోధ్య రాములోరి హారతి, దర్శన సమయాల్లో మార్పు
అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రామమందిరంలోనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది.
Ayodhya : అయోధ్య రామమందిరం ప్రారంభోత్సవం తర్వాత భక్తుల రద్దీ భారీగా పెరిగింది. రామమందిరంలోనే కాకుండా పక్కనే ఉన్న హనుమాన్ గర్హి ఆలయం వద్ద కూడా భక్తుల సంఖ్య పెరుగుతోంది. రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ ట్రస్టు భక్తులకు హారతి, దర్శన సమయాలను మార్చింది. ఉదయం 4:30 గంటలకు రామ్ లల్లా విగ్రహానికి శృంగార్ హారతి (ప్రార్థన), ఉదయం 6:30 గంటలకు మంగళ ప్రార్థన జరుగుతుంది. ఉదయం ప్రార్థన అనంతరం 7 గంటల నుంచి భక్తులను దర్శనానికి అనుమతిస్తారు.
మధ్యాహ్నం భోగ్ (నైవేద్యం) ప్రార్థన, సాయంత్రం 7:30 గంటలకు సాయంత్రం హారతి నిర్వహించబడుతుంది. సాయంత్రం నైవేద్య ప్రార్థన రాత్రి 8 గంటలకు జరుగుతుంది. ఆరోజు చివరి ప్రార్థన అయిన శయన హారతి రాత్రి 10 గంటలకు జరుగుతుందని విశ్వహిందూ పరిషత్ ప్రాంతీయ అధికార ప్రతినిధి, మీడియా ఇన్ఛార్జ్ శరద్ శర్మ తెలిపారు. జనవరి 22న అయోధ్యలో రామమందిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోడీ ముఖ్య అతిథిగా హాజరుకాగా, దేశంలోని ప్రముఖులు హాజరయ్యారు.