»Jagans Comments On Pawan Kalyan Bandla Ganesh Raised His Hands And Asked Him Not To Criticize Him
Pavan Kalyan గురించి విమర్శించవద్దు: బండ్ల గణేష్
జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం జగన్ తీవ్రస్థాయిలో విమర్శించారు. ఆ కామెంట్లపై నిర్మాత బండ్ల గణేష్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడొద్దు అని హితవు పలికారు.
Pavan Kalyan : జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కల్యాణ్‌పై ఏపీ సీఎం వైఎస్ జగన్ తీవ్ర విమర్శలు చేశారు. వ్యక్తిగత అంశాలపై మాట్లాడారు. ఆ కామెంట్లపై సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పందించారు. పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై విమర్శలు చేయడం సరికాదన్నారు. సీఎం జగన్ చేసిన వ్యాఖ్యలను ఖండించారు. పవన్ కల్యాణ్ తనకు దేవుడితో సమానం. అతనొక గొప్ప వ్యక్తి. నిజాయితీపరుడు. నీతిమంతుడు. కష్టాల్లో ఉన్నామని ఎవరు చేయి చాచిన సాయం చేసే వ్యక్తిత్తవం కలవాడు. ఎలాంటి స్వార్థం లేని వ్యక్తి. ఇలాంటి వ్యక్తి వ్యక్తిగత విషయాలను విమర్శంచవద్దు. అతని గురించి పూర్తిగా తెలియకుండా మాట్లాడవద్దని బండ్ల గణేష్ హితవు పలికారు.
ప్రతి ఒక్కరి జీవితంలో కొన్ని చేదు ఘటనలు ఉంటాయి. పవన్ జీవితంలో జరిగి ఉంటాయని తెలిపారు. ఆయనకు కులమత బేధం లేదు. అలా ఉంటే తనను ఎందుకు నిర్మాతను చేస్తాడు. ఈ రోజు తనకు ఈ స్టాటస్ ఉందంటే.. అది పవన్ కల్యాణ్ పెట్టిన భిక్ష. దశాబ్దాల నుంచి అతనితో తిరుగుతున్నాను. గొప్ప వ్యక్తిని సంబంధం లేని కారణాలతో విమర్శించవద్దు. సమాజానికి ఉపయోగపడే మనిషి అని కొనియాడారు. హాయిగా షూటింగ్ చేసుకోకుండా.. ప్రజలకు మంచి చేయాలని తలచాడు. సంపాదించిన డబ్బుతో పార్టీ నడుపుతున్నాడు. ఇలాంటి వ్యక్తి వ్యక్తిగత విషయాల గురించి విమర్శంచడం కరెక్ట్ కాదు. పవన్ కల్యాణ్‌పై అబాండాలు వేస్తూ విమర్శించవద్దని బండ్ల గణేష్ చేతులెత్తి వేడుకున్నారు. ఆ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది.