minister Dharmana Krishna Das: ఏపీలో ఎన్నికల హీట్ పెరుగుతోంది. స్కిల్ స్కామ్‌లో చంద్రబాబు అరెస్ట్‌తో రాజకీయాలు పీక్కు చేరాయి. ఇప్పుడు లోకేశ్ చుట్టూ కొనసాగుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో విజయంపై అధికార వైసీపీ ధీమాతో ఉంది. లోన మాత్రం కాస్త భయంగా ఉన్నట్టు ఉంది. దీనికి తోడు కొందరు నేతలు.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయం అంటున్నారు.
వచ్చే ఎన్నికల్లో బరిలోకి దిగనని మాజీ మంత్రి, ఎమ్మెల్యే పేర్ని నాని ఇదివరకే సీఎం జగన్‌కు స్పష్టంచేశారని వార్త వినిపించింది. ఆయనకు సీఎం జగన్ నచ్చ జెప్పారని వైసీపీ నేతలు చెబుతున్నారు. ఇప్పుడు మంత్రివర్గంలోని సహాచరుడు ధర్మాన కృష్ణదాస్ (Krishna Das) వంతు వచ్చింది. వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని అంటున్నారు. ఇదే విషయం సీఎం జగన్‌కు కూడా చెప్పారు. తనను వదిలేయాలని కోరారట. గత 40 ఏళ్ల నుంచి రాజకీయాల్లో ఉన్నానని.. ఇక చాలు అన్నారని తెలిసింది. ఇక విశ్రాంతి తీసుకునే సమయం ఆసన్నమైందని అంటున్నారు.
ఇటీవల జరిగిన సభలు, సమావేశాల్లో ధర్మాన కృష్ణదాస్ (Krishna Das) హాట్ కామెంట్స్ చేశారు. ప్రతిపక్షాలపై తనదైన శైలిలో విమర్శలు చేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం రావడం లేదు. ఇదో.. లేదంటే మరో కారణమో తెలియదు.. ఇక రాజకీయాల నుంచి తప్పుకుంటా అని మాత్రం చెబుతున్నారు. పార్టీలో కొనసాగాలని, మరోసారి పోటీ చేయాలని ధర్మాన కృష్ణదాస్‌ను సీఎం జగన్ కోరారని.. దీనిపై నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
వైసీపీకి జనంలో అంత పాపులారిటీ ఉంటే.. వచ్చే ఎన్నికల్లో విజయఢంకా మోగిస్తుందని ధీమాతో ఉంటే.. మరీ ఆ పార్టీ నేతలు ఎందుకు కంటెస్టెంట్ చేయడం లేదని ప్రశ్న వస్తోంది. ఆ నేతలను సీఎం జగన్ ఒప్పించారని.. వచ్చే ఎన్నికల్లో కూడా తమదే విజయం అని వైసీపీ ధీమాతో ఉంది. ఏం జరుగుతుందో చూడాలీ.