»Hyderabad Man In Forbes List Starting With Rs 250 And Becoming A Billionaire Today
Murali Divi: ఫోర్బ్స్ జాబితాలో హైదరాబాద్ వ్యక్తి.. రూ.250తో ప్రారంభమై నేడు కోట్లాధికారి!
ఫోర్బ్స్ జాబితాలో దివి ల్యాబ్స్ అధినేత మురళి దివికి చోటు దక్కింది. రూ.53 వేల కోట్ల ఆస్తులతో ఆయన హైదరాబాద్‌లోనే రిచ్చెస్ట్ మ్యాన్‌గా చరిత్ర సృష్టించాడు.
ఫోర్బ్స్ జాబితా (Forbes List)లో ఆంధ్రప్రదేశ్(Andhrapradesh)కు చెందిన వ్యక్తి మురళీ దివి(Murali Divi)కి చోటు దక్కింది. మంగళవారం ఫోర్బ్స్ సరికొత్త జాబితాను విడుదల చేసింది. ఈ జాబితాలో హైదరాబాద్(Hyderabad)లోనే అత్యంత కోటీశ్వరుడిగా మురళీదివి నిలవడం విశేషం. రూ.250తో ప్రారంభమైన ఆయన వ్యాపారం నేడు 53 వేల కోట్ల ఆస్తికి చేరువైంది. ఆయన స్థాపించిన సంస్థే దివీస్ ల్యాబ్స్(Divis Labs). చిన్నతనంలో ఆయనకు పెద్దగా చదువు అబ్బలేదు. తన అన్నలాగే బీఎస్సీ చేసి సరిపెట్టుకోవాలని మణిపాల్ కాలేజీలో చేరాడు.
పద్నాలుగు మంది సభ్యులున్న కుటుంబంలో మురళీ దివి(Murali Divi) జన్మించాడు. నాన్న ప్రభుత్వ ఉద్యోగి. పదివేల పెన్షన్‌తోనే కుటుంబం మొత్తం గడిచేది. బీఎస్సీ డిగ్రీ అయ్యాక ఓ సంస్థలో మురళి ఫార్మసిస్ట్‌గా చేరాడు. ఆ సమయంలో అతని నెల జీతం రూ.250లు మాత్రమే. 1976లో అమెరికాకు వెళ్లి ఉద్యోగం చేయాలనుకున్నాడు. బంధువుల సహకారంతో అమెరికా వెళ్లి అక్కడ ట్రినిటీ కెమికల్స్, ఫైక్ కెమికల్స్ సంస్థల్లో పనిచేశాడు. ఏటా 65 వేల డాలర్ల జీతాన్ని పొందాడు.
1995లో మురళీ(Murali Divi).. రెడ్డి ల్యాబ్స్ నుంచి బయటికి వచ్చాక తన సొంతంగా సొంతంగా దివీస్ ల్యాబ్స్ అనే సంస్థను ప్రారంభించాడు. హైదరాబాద్ చౌటుప్పల్‌లో తన మొదటి ఫ్యాక్టరీని 1995లో స్థాపించాడు. ఆ తర్వాత ఏడేళ్లకు 2002లో దివీస్ ల్యాబ్స్ రెండో ఫ్యాక్టరీని విశాఖపట్నంలో ప్రారంభించాడు. ఈ క్రమంలో 2022లో దివీస్ ల్యాబ్స్ ఏకంగా 88 బిలియన్లు అంటే 8800 కోట్ల వ్యాపారం చేసి చరిత్ర సృష్టించింది. తాజాగా ఆయన రూ.53 వేల కోట్ల ఆస్తులతో హైదరాబాద్(Hyderabad)లోనే అత్యంత సంపన్నుడుగా ఫోర్బ్స్ జాబితా(Forbes List)లోకి చేరారు.