»Hero Prabhas Peddamma Shyamala Devi Contest For Mp Next Ap Elections
Prabhas: ప్రభాస్ పెద్దమ్మ ఎంపీగా పోటీ?
పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్(prabhas) వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే తన ఫ్యామిలీకి సినీ క్రేజ్ తో పాటు పొలిటికల్ బ్యాగ్రౌండ్ కూడా ఉంది. గతంలో కృష్ణంరాజు ఎంపీగా పనిచేశారు. అయితే ప్రస్తుతం అతని మరణంతో రాజు భార్య శ్యామలా దేవి(shyamala devi) త్వరలో రాజకీయ ప్రవేశం చేయనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం స్టార్ హీరో ప్రభాస్(Prabhas) పాన్ ఇండియా స్టార్ గా కొనసాగుతున్నారు. అయితే ఆయన ఫ్యామిలీకి రాజకీయ నేపథ్యం కూడా ఉంది. ఆయన పెదనాన్న కృష్ణంరాజు గతంలో ఎంపీ(MP)గా పని చేశారు. బీజేపీ నేతగా ఢిల్లీలో చక్రం తిప్పారు. ఇప్పుడు ఆయన అకాల మరణంతో రాజకీయంగా ఎవరు పోటీలో ఉంటారనే ప్రశ్న నెలకొంది. ఈ క్రమంలో ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి(shyamala devi) త్వరలో పొలిటికల్ ఎంట్రీ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. ఆమె పశ్చిమగోదావరి జిల్లా నర్సాపురం లోక్‌సభ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ స్థానంలో రఘు రామకృష్ణంరాజు ఇప్పటికే ఎంపీగా ఉన్నారు. అయితే ఆయన వైసీపీకి రెబల్‌గా మారారు.
ఈ నేపథ్యంలో వైసీపీ(YSRCP) కొత్త నేత కోసం వెతుకుతోంది. ఆ క్రమంలో నర్సాపురంలో కృష్ణంరాజు ఓట్లు కీలకం కానున్నాయి. దీంతో క్షత్రియ సామాజికవర్గానికి చెందిన శ్యామలాదేవిచే ఎంపీగా పోటీ చేయించాలని చూస్తున్నట్లు తెలిసింది. అయితే గోదావరి జిల్లాల పర్యవేక్షకులుగా ఉన్న వైసీపీ(YSRCP) ఎంపీలు ఇప్పటికే ప్రతిపాదనలు పంపారని ఈ విషయంపై శ్యామలాదేవి ఇంకా నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది. అయితే ఆమె త్వరలోనే ఒప్పుకుంటారని వైసీపీ భావిస్తోంది. మరోవైపు వైసీపీతో ప్రభాస్(prabhas) ఫ్యామిలీకి మంచి అనుబంధం ఉంది. కాబట్టి జగన్ నిర్ణయాన్ని ఆమె అంగీకరిస్తారని భావిస్తున్నారు. అదే జరిగితే ఏపీలో ప్రభాస్ ఫ్యామిలీకి మంచి పట్టు రావడం ఖాయమనే చెప్పవచ్చు.