ఆయన ఫోటో కోసం పడిగాపులు కాసినోళ్లు ఆయన మీద కారు కూతలు కూస్తున్నారని జనసేన నేత, సినీ నటుడు నాగబాబు (Naga Babu) మండిపడ్డారు. ఆకాశం మీద ఉమ్మాలని చూస్తే మీ ముఖం మీద పడుతుందని ఆయన విమర్శించారు. మీ బతుక్కి మీ శాఖల మీద అవగాహన ఉండదు, అభివృద్ధి అనేదానికి అర్ధమే తెలియదు అని విమర్శించారు. బటన్ నొక్కి, కోట్లల్లో ముంచి, వేల మందికి ఉచితాలు పంచడమే అభివృద్ధి అనుకుంటున్నారా..? అభివృద్ధి చేయడానికి ఇంకేం మిగిలి లేదనుకుంటున్నారా? అని ప్రశ్నించారు. మీ ఆలోచనలు ఎంత క్షీణించి పోయాయో, అజ్ఞానంతో కూడిన మీ మాటలు వింటే అర్థం అవుతుందని అన్నారు.
మీ దౌర్భాగ్యపు దుర్మార్గపు పాలనకి ఎండ్ కార్డ్ దగ్గర్లోనే ఉందని తెలిపారు. కాలం గాలమేస్తే ప్రకృతే శత్రువవుతుందని… ఆరోగ్యాలు జాగ్రత్త అని హెచ్చరించారు.పేదోడి కడుపు నింపుడం మానేసి చిత్రపరిశ్రమపై పడతారేంటీ అంటూ మెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi) ఏపీ ప్రభుత్వ పెద్దలపై విమర్శలు చేసిన విషయం తెలిసిందే. సీఎం జగన్ (CM Jagan) దుర్మార్గపు పాలనకు త్వరలోనే ఎండ్ కార్డు తప్పదని అన్నారు. తమ బతుకులకు శాఖల మీద అవగాహన ఉండదని అభివృద్ధి అనేదానికి అర్థమే తెలియదని ఏపీ మంత్రులపై విరుచుకుపడ్డారు. మెగా అభిమానులుల వైసీపీ నాయకుల (YCP leaders) వ్యాఖ్యలను ఖండిస్తూ పలు చోట్ల ధర్నాలకు దిగారు.