సినీనటి, మాజీ ఎంపీ జయసుధ ఆరు పదుల వయసులో మూడో పెళ్లి చేసుకోబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. 64ఏళ్ల వయసులో ఆమె రహస్యంగా ఓ వ్యక్తిని మూడో పెళ్లి చేసుకున్నారంటూ పుకార్లు వచ్చాయి. కాగా… ఈ వార్తలపై ఆమె స్పందించారు. తాను ఎలాంటి పెళ్లి చేసుకోలేదని క్లారిటీ ఇచ్చారు. జయసుధ రెండో భర్త నితిన్ కపూర్ 2017లో కన్నుమూశారు. కొన్ని మానసిక సమస్యల కారణంగా ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. ఆ తర్వాత ఆమె తన కొడుకులతో నివాసం ఉంటున్నారు. అడపాదడపా సినిమాల్లో చేస్తున్నారు. ఈమద్యే బాలకృష్ణ హోస్ట్ గా నిర్వహిస్తున్న అన్ స్టాపబుల్ షో కి అతిధిగా హాజరయ్యారు.
గతేడాది జయసుధ కొన్ని అనారోగ్య కారణాలతో అమెరికా వెళ్లి ట్రీట్మెంట్ తీసుకున్నారు.ఈ నేపథ్యంలో ఆమె అమెరికాలో ఓ బిజినెస్ మ్యాన్ని పెళ్లి చేసుకుందని వార్తలు ప్రచారమయ్యాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వార్తలపై జయసుధ స్పందించింది. అతను తనకు స్నేహితుడు మాత్రమే అని.. అమెరికా నుండి వచ్చాడని తన బయోపిక్ తీసేందుకు అన్నీ దగ్గరుండి గమనిస్తున్నాడని జయసుధ తెలిపారు.