SKLM: భారతరత్న ఏపీజే అబ్దుల్ కలాం స్ఫూర్తి ఎప్పటికీ సజీవంగా నిలిచి ఉంటుందని మున్సిపల్ కమిషనర్ ప్రసాదరావు తెలిపారు. బుధవారం శ్రీకాకుళం స్వాతంత్ర సమరయోధుల వనంలో 94వ జయంతి సందర్భంగా అబ్దుల్ కలాం విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఆయన మాట్లాడుతూ.. అబ్దుల్ కలాం ప్రపంచానికి ప్రభావితం చేసిన అత్యంత దేశభక్తుడు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.