కృష్ణా: జిల్లా TDP అధ్యక్షుడిగా ఎంపికైన వీరంకి వెంకట గురుమూర్తి కుటుంబ సభ్యులతో కలిసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సీఎం నారా చంద్రబాబు నాయుడుని మర్యాదపూర్వకంగా గురువారం కలిశారు. ఈ సందర్భంగా సీఎం ఆశీస్సులు తీసుకున్నారు. జిల్లా పార్టీని మరింత బలోపేతం చేయాలని సీఎం సూచనలు చేశారు. పార్టీ బాధ్యతలను నిబద్ధతతో నిర్వహిస్తామని గురుమూర్తి తెలిపారు.