కోనసీమ: మామిడికుదురు మండలం పాసర్లపూడి గ్రామం కొండాలమ్మ చింత సెంటర్లో మంగళవారం మధ్యాహ్నం తుఫాన్ నేపధ్యంలో వీచిన ఈదురు గాలులకు భారీ చెట్టు కూలిపోయింది. చెట్టు ఆటోపై పడడంతో ఆటో పూర్తిగా ధ్వంసం అయిందని స్థానికులు తెలిపారు. చెట్టు పడిన సమయంలో అక్కడ ఎవరూ లేకపోవడంతో ప్రమాదం తప్పిందని వారు పేర్కొన్నారు.