కృష్ణా: కండ్రికలోని టీడీపీ కార్యాలయంలో మంగళవారం జరిగిన విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే బొండా ఉమ హాజరయ్యారు. కార్యక్రమంలో భాగంగా టీడీపీ నాయకుడు కాకొల్లు రవికుమార్ సౌజన్యంతో దివ్యాంగులకు 125 నిత్యావసర కిట్లు, ట్రై సైకిల్స్‌ను ఉమ అందజేశారు. కార్యక్రమంలో స్థానిక టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.