అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ టిడ్కో, హౌసింగ్, మున్సిపల్, పబ్లిక్ హెల్త్ అధికారులతో సమావేశమయ్యారు. టిడ్కో ఇళ్ల నిర్మాణాలు వెంటనే ప్రారంభించాలని ఆదేశించారు. మార్చి చివరి నాటికి ఎక్కువ ఇళ్లు సిద్ధం చేయాలని సూచించారు. సీసీ రోడ్లు, డ్రైనేజీలు, సబ్స్టేషన్లు, ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటుకు చర్యలు వేగవంతం చేయాలని ఆదేశించారు.