»Fatal Road Accident In Annamaiya District Four People Died
Kothapally Cross Road : అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురి దుర్మరణం
అన్నమయ్య జిల్లా(Annamaya District)లో అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. చిత్తూరు-కడప జాతీయ రహదారిపై రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ పరిధిలోని కొత్తపల్లి క్రాస్ (Kothapally Cross Road)వద్ద ఈ ఘటన జరిగింది.
అన్నమయ్య జిల్లా (Annamaya District) రామాపురం మండలం కొత్తపల్లి క్రాస్ రోడ్డు (Kothapally Cross Road) వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అర్ధరాత్రి రెండు కార్లు ఢీకొన్న ఘటనలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మరో నలుగురు తీవ్రంగా గాయ పడ్డారు. వైయస్ఆర్ జిల్లా బద్వేలు (Badvelu)కు చెందిన పెనమాల లక్ష్మమ్మ(65) పక్షవాతంతో బాధపడుతుండడంతో కుటుంబసభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం చిత్తూరు జిల్లా విరూపాక్షపురాని(Virupaksapurani)కి కారులో తీసుకెళు తున్నారు. కొత్తపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వస్తున్న మరో కారు వీరి ప్రయాణిస్తున్న వాహనం ఢీకొన్నాయి.
ప్రమాదంలో లక్ష్మమ్మతో పాటు వారి కుమారుడు నర్సయ్య (41), కారు డ్రైవరు రాజారెడ్డి (35) అక్కడికక్కడే మృతిచెందారు. కారులో ఉన్న వారి బంధువులు చిన్నక్క(60), బాలుడు హర్షవర్ధన్ తీవ్రంగా గాయపడ్డారు. కడప రిమ్స్‌లో చికిత్స పొందుతూ చిన్నక్క మృతిచెందారు. రాయచోటి(Rayachoti) వైపు నుంచి కడప వెళుతున్న మరో కారులో ప్రయాణిస్తున్నవారిలో ముగ్గురు గాయపడ్డారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులను కడప రిమ్స్(Kadapa rims)కు తరలించారు. రాయచోటి డీఎస్పీ శ్రీధర్ ప్రమాదస్థలాన్ని పరిశీలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.