Farmer Burnt Alive:పొలంలోని వ్యర్థాలను తగలబెడుతూ ఓ రైతు ప్రాణాలను కోల్పోయాడు. ఆంధ్రప్రదేశ్లో గల పల్నాడు (palnadu) జిల్లాలో ఈ విషాద ఘటన జరిగింది. నాదెండ్ల మండలం సాతులూరులో రైతు బంగారుపల్లి వెంకటేశ్వర్లు (venkateshwarlu) మొక్కజొన్న పంట సాగుచేశాడు. మొక్కజొన్న కోసిన తర్వాత మిగిలిన వ్యర్థాలను తగలబెట్టాడు.
మంటలు పక్కనే ఉన్న తన సోదరుడి పొలంలోకి వ్యాపిస్తున్నాయని ఆ రైతు గుర్తించాడు. వాటిని నిలువరించేందుకు పరుగెడుతూ కిందపడిపోయారు. ఆయన కిందపడిన సమయంలో పక్కనే గొర్రె కాపరులు ఉన్నారు. అతనిని రక్షించేందుకు యత్నించినా మంటలు ఎక్కువగా ఉండటంతో కాపాడటం వీలు కాలేదు. మంటలు చుట్టుముట్టి ఆ రైతు సజీవ దహనం అయ్యాడు.
రైతు బండారుపల్లి వెంకటేశ్వర్లు (venkateshwarlu) ఇంటికి రాకపోవడంతో ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు వెతికారు. పొలంలో ప్రమాదం జరిగిందని తెలుసుకొని బోరున విలపించారు. రైతు మృతదేహానికి నరసరావుపేట టీడీపీ ఇంచార్జీ చదలవాడ అరవిందబాబు (aravinda babu) నివాళులర్పించారు.