ATP: నేపాల్లో అల్లర్ల సమయంలో చిక్కుకున్న 225 మంది తెలుగువారిని మంత్రి నారా లోకేష్ చొరవతో సురక్షితంగా ఇంటికి చేర్చారు. అనంతపురం జిల్లాకు చెందిన 14 మంది వారి ఇంటికి చేరుకోగా ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్, జిల్లా టీడీపీ అధ్యక్షులు వెంకట శివుడు యాదవ్ స్వయంగా పరామర్శించారు. సీఎం చంద్రబాబు, లోకేష్లకు బాధితులు కృతజ్ఞతలు తెలిపారు.