E.G: నిబంధనలు పాటిస్తూ 2026 నూతన సంవత్సర వేడుకలు జరుపుకోవాలని, అర్ధరాత్రి రోడ్డు మీద వేడుకలకు అనుమతులు లేవని కడియం సీఐ వెంకటేశ్వరరావు అన్నారు. ఇవాళ కడియంలో ఆయన మాట్లాడుతూ.. మద్యం సేవించి, ట్రిపుల్ రైడింగ్ చేసి వాహనం నడిపిన వారిపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31వ తేది రాత్రివేళ గ్రామాలలో గస్తీ ముమ్మరంగా వుంటుందన్నారు.