ATP: గుంతకల్లు మండల కేంద్రంలో నూతనంగా ఎంపికైన ఆశా వర్కర్లకు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం, డాక్టర్ గంగాధర్ శుక్రవారం ఉద్యోగ నియామక పత్రాలను అందజేశారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థలో ఆశా వర్కర్ల ప్రాముఖ్యతను తెలియజేస్తూ, ప్రజలకు అందుబాటులో ఉంటూ, ఆరోగ్యంపై తీసుకోవలసిన జాగ్రత్తలను ప్రజలకు తెలియజేయాలన్నారు.