W.G: కాళ్ళ మండలం సీసలిలోని శ్రీ గోపాలస్వామి వారి దేవస్థానంలో స్వామి వారిని గురువారం డిప్యూటీ స్పీకర్, ఎమ్మెల్యే రఘురామకృష్ణ రాజు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం దేవస్థానం ట్రస్ట్ బోర్డు ఛైర్మన్, ధర్మకర్తల ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొని నూతన కార్యవర్గం చేత ఆయన ప్రమాణ స్వీకారం చేయించారు.