కృష్ణా: వల్లభనేని వంశీకి ఏపీ హైకోర్టులో ఊరట లభించింది. బెజవాడ మాచవరం పోలీస్ స్టేషన్లో వంశీపై నమోదైన హత్యాయత్నం కేసులో ఆయనను అరెస్ట్ చేయవద్దని పోలీసులను శుక్రవారం హైకోర్టు ఆదేశించింది. ఈ కేసులో ముందస్తు బెయిల్ మంజూరు చేయాలంటూ వంశీ హైకోర్టును ఆశ్రయించగా, విచారణ సందర్భంగా కోర్టు ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.