తూర్పు గోదావరి జిల్లాలోని నిరుద్యోగ యువత కోసం ఉద్యోగ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి అధికారి కె. హరీష్ చంద్ర ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. సెప్టెంబర్ 12న శుక్రవారం ఉదయం 10 గంటలకు రాజమండ్రి అర్బన్ నియోజకవర్గంలోని మోడల్ కెరీర్ సెంటర్ ప్రాంగణంలో ఈ జాబ్ మేళా జరగనున్నట్లు పేర్కొన్నారు. ఐటీఐ, ఇంటర్, ఏదైనా డిగ్రీ పూర్తిచేసిన అభ్యర్థులను అర్హులుగా ప్రకటించారు.