PPM: అనీమియా కేసులు ఇకపై ప్రతీ నెలా తగ్గుదల కొనసాగాలని వైద్యాధికారులు, ANM లకు పార్వతీపురం జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ స్పష్టం చేసారు. గర్భిణుల్లో రక్తహీనత ఉండకూడదని, కనీసం 11 శాతంకు తగ్గకుండా చూడాలని, లక్ష్యసాధనలో నిర్లక్ష్యం వహించిన, గర్భిణీలో రక్తహీనత ఉన్నట్లు నిర్ధారణ అయితే స్థానిక వైద్యాధికారి, ఏఎన్ఎం, అంగన్వాడీలపై చర్యలు తప్పవని హెచ్చరించారు.