ATP: గుంతకల్లు పట్టణంలోని 60 ఫీట్ రోడ్డులో సోమవారం ఉదయం జరిగిన ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ లీకేజీ ఘటనలో గాయపడిన వారిని గుంతకల్లు ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం సోదరులు గుమ్మనూరు శ్రీనివాసులు, నారాయణస్వామి పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని సూచించారు.