NLR: జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ విషయంలో కూటమి ప్రభుత్వం మత్స్యకారులను మోసం చేస్తోందని మాజీ మంత్రి కాకాణి విమర్శించారు. గత ప్రభుత్వం మత్స్యకారుల కోసం కేటాయించిన భూములను సాగర్ డిఫెన్స్‌కు అప్పగించడం అన్యాయమన్నారు. అక్రమ వేటను అరికట్టడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు. తక్షణమే మత్స్యకారుల సమస్యలను పరిష్కరించకుంటే పోరాటం ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.