అన్నమయ్య: జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ బుధవారం వీడియో కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ.. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. విద్యార్థుల ఆరోగ్యం, భద్రతపై నిర్లక్ష్యం వహించవద్దని హెచ్చరించారు. మధ్యాహ్న భోజన పథకంలో నాణ్యతను పరిశీలించడానికి ప్రతిరోజూ ఒక ఉపాధ్యాయుడు విద్యార్థులతో కలిసి భోజనం చేయాలని సూచించారు.