KRNL: నందవరం గ్రామ పంచాయతీ ఆవరణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ గ్రామ ప్రజలు, యువకులు సోమవారం ఎమ్మిగనూరు ఎమ్మెల్యే బీవీ జయనాగేశ్వర్ రెడ్డిని ఆర్ అండ్ బి అతిథి గృహంలో కలిసి వినతిపత్రం అందజేశారు. గ్రామంలో యువతకు స్ఫూర్తినిచ్చేలా శివాజీ మహారాజ్ విగ్రహం ఏర్పాటు చేయాలని వారు విజ్ఞప్తి చేశారు.