VSP: శ్రీశ్రీ శ్రీ వరాహలక్ష్మీనృసింహ స్వామి సన్నిధిలో సంక్రమణం పురస్కరించుకొని శ్రీ స్వామివారి గ్రామ తిరువీధి మహోత్సవాన్ని శనివారం ఆలయ సిబ్బంది అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ ఉత్సవంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ఈమేరకు ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు.