W.G: ఆకివీడులోని బేకరీలు, హోటళ్లు, పాల విక్రయ కేంద్రాలపై బుధవారం ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృత దాడులు నిర్వహించారు. ఫుడ్ ఇన్స్ఫెక్టర్ ఏఎస్ఆర్ రెడ్డి ఆధ్వర్యంలో పలు హోటళ్లలో ఆహార నమూనాలను సేకరించి, పరీక్షల నిమిత్తం ల్యాబ్‌లకు పంపారు. వినియోగదారులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, పరిశుభ్రత పాటించని పక్షంలో కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు