అన్నమయ్య: మదనపల్లె మండలం సీటీఎం-1 పంచాయతీ పరిధిలోని వారపు సంత వేలం పాటలను ఈ నెల 31న నిర్వహించనున్నట్లు సర్పంచ్ ఆనందపార్థసారథి, కార్యదర్శి పవనకుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటలకు సీటీఎం-1 గ్రామ సచివాలయంలో డీఎల్పీవో సమక్షంలో వేలం జరుగుతుందని పేర్కొన్నారు. వేలంలో పాల్గొనాలనుకున్న వారు నిర్ణయించిన డిపాజిట్ చెల్లించి హాజరు కావాలని సూచించారు.