CTR: ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడిన సంఘటన బుధవారం బంగారుపాళ్యం మండలంలో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. BLకండ్రిగ గ్రామానికి చెందిన పాల్యంతోపు చెరువులోకి ఎస్టీ కాలనీకి చెందిన ఓ అమ్మాయి(12), అబ్బాయి(7) ఈతకు వెళ్లారు. అక్కడ బురదలో చిక్కుకొని ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. దీంతో గ్రామంలో విషాదం నెలకొంది.