NTR: ఏ కొండూరు (M) కోడూరులో స్వచ్ఛంద బడిబాట కార్యక్రమం ముమ్మరంగా నిర్వహించారు. మండల పరిషత్ ఆదర్శ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎం. రాం ప్రదీప్ మాట్లాడుతూ.. పాఠ్యాంశాలతో పాటు ఉచితంగా స్పోకెన్ ఇంగ్లీష్ బోధించేందుకు అదనపు తరగతులు నిర్వహిస్తామని తెలిపారు. ప్రభుత్వ పథకాలపై కరపత్రాలు పంపిణీ చేసి, విద్యార్థులకు నోటు పుస్తకాలు అందజేశారు.