ప్రకాశం: సింగరాయకొండ ఎంపీడీవో జయమని సమక్షంలో పలువురు గ్రామ పెద్దలు గవదగట్ల వారిపాలెం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు శనివారం విద్యా సామాగ్రిని పంపిణీ చేశారు. వారు మాట్లాడుతూ.. సమాజానికి ఉపయోగపడే ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం ఎంతో ఆనందంగా ఉందని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగిస్తామని తెలిపారు.