W.G: దీపావళి నేపథ్యంలో ప్రజల ప్రాణ, ఆస్తి రక్షణకు ప్రాధాన్యతనిస్తూ, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆదేశాలతో గురువారం జిల్లా వ్యాప్తంగా బాణాసంచా తయారీ, విక్రయ కేంద్రాలపై అధికారులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు చేశారు. భద్రతా నిబంధనలు కచ్చితంగా పాటించని పలు దుకాణాలను మూసివేసినట్లు ఎస్పీ తెలిపారు.