NLR: మున్సిపాలిటీ పరిధిలో ఎక్కడా కూడా పారిశుద్ధ్యం లోపించకుండా ఎప్పటికప్పుడు చెత్త నిల్వలు తొలగించాలని మున్సిపల్ కమిషనర్ ఫజులుల్లా సిబ్బందికి సూచించారు. మంగళవారం నాయుడుపేట మున్సిపాలిటీ పరిధిలోని పలు వార్డుల్లో జరుగుతున్న పారిశుద్ధ్య పనులను ఆయన పరిశీలించారు. ప్రతిరోజు చెత్త నిల్వలను తొలగించడంతో పాటు మురుగునీరు ముందుకు సాగేలా చర్యలు చేపట్టాలన్నారు.