సత్యసాయి: సత్యసాయిబాబా శత జయంతి ఉత్సవాల్లో పాల్గొనేందుకు ప్రధాని మోదీ నవంబర్ 19న పుట్టపర్తికి రానున్నారు. ప్రశాంతి నిలయంలో జరగబోయే ఈ ప్రతిష్ఠాత్మక కార్యక్రమంలో ప్రధాని పాల్గొననుండటంతో జిల్లా యంత్రాంగం, సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ భారీ ఏర్పాట్లను చేస్తున్నాయి. ఈ ఉత్సవాల్లో ప్రధాని మోదీతో పాటు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పాల్గొననున్నారు.