ASR: రాజవొమ్మంగి మండలం కరుదేవపాలెం మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల వర్షపు నీటితో చుట్టుముట్టింది. ఈ పాఠశాలలో 32 మంది గిరిజన విద్యార్థులు ఒక్క గదిలోనే ఐదు తరగతుల బోధన పొందుతున్నారు. పాఠశాలలో ఉన్న రెండు భవనాల్లో ఒకటి పూర్తిగా శిథిలావస్థకు చేరుకోవడంతో విద్యార్థులు ఆ భవనంలోకి వెళ్లకుండా చుట్టూ కప్పివేశారు. ఒకే ఉపాధ్యాయుడు బాధ్యతలు నిర్వహిస్తున్నారు.