సత్యసాయి: చిలమత్తూరులో ఆదివారం రాత్రి దారుణం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల మేరకు.. మద్యం మత్తులో భార్య లక్ష్మిదేవి(35)తో వాగ్వాదానికి దిగిన రాఘవేంద్ర కోపోద్రిక్తుడై గొడ్డలితో నరికి హతమార్చాడు. రక్తమోడుతున్న ఆమెను ఆసుపత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. దంపతులకు ఇంటర్ చదువుతున్న ఒక కుమార్తె ఉంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు.