పల్నాడు జిల్లాలో వైసీపీ పార్టీ రాజకీయ ఉనికి కోసమే కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టిందని పల్నాడు జిల్లా టీడీపీ అధ్యక్షుడు కొమ్మలపాటి శ్రీధర్ తెలిపారు. గురువారం నరసరావుపేట టీడీపీ జిల్లా కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ చేపట్టిన కోటి సంతకాలు ప్రజలు చేశారో లేక వైసీపీ కార్యకర్తలు చేశారో త్వరలో తెలుస్తుందన్నారు.